జగన్ నియంతలా వ్యవహరిస్తూ విధ్వంసకర పాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ విమర్శించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం కాగానే ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తే.. జగన్ సీఎం కాగానే రూ.9 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చేశారని ఎద్దేవా చేశారు.
ముళ్ల కంచెలు, పరదాల మధ్యే జగన్ పర్యటనలు సాగుతున్నాయన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రజారంజక పాలన చేయాలని హితవు పలికారు.