అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన రోజున జాతీయ సెలవు ప్రకటించాలని ఓ సాధువు డిమాండ్ చేశారు.
మహారాష్ట్రకు చెందిన మహంత్ అంకిత్ శాస్త్రి మహారాజ్, 2024 జనవరి 22వ తేదీని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు.