తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ పనులను రూ.197 కోట్లతో చేపట్టడానికి టెండరు డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించారు.
ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 18న సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని కోరారు. సలహాలు, అభ్యంతరాలను apjudicialpreview@gmail.com కు లేదా cettdtpt@gmail.com కానీ మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరారు.