తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధ్యమైనంత నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుందామని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెనాలి రూరల్, కొల్లిపర మండల పరిధిలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపునకు గురైన వ్యవవసాయ భూముల్లో వర్షపు నీరు బయటకు మళ్లించేందుకు తొలిప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి పంట నష్టం పరిశీలన చేపట్టనున్నట్టు తెలిపారు.