గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురు వైసీపీ కార్యాలయం రోడ్డులో రెండు నెలల నుంచి ఏపీ 39 డీడబ్ల్యు 2543 నెంబర్ గల కారు పార్క్ చేసి ఉంది. కారు యధా స్థానంలోనే నిలిపి ఉండటంతో కారును ఎవరు నిలిపి వెళ్లారు.
ఇప్పటివరకు ఎందుకు రాలేదు. చుట్టుపక్కల ప్రజలకు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అర్బన్ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.