ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్‌ది ఏ నియోజకవర్గం..? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? ఏపీలో పవన్ నివాసం ఎక్కడ..? అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేశాడని, ఏపీలో మాత్రం టీడీపీతో జత కట్టాడని, పొలిటికల్ కాంట్రాక్టుల కోసమే పుట్టిన పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లో నటించడం వల్ల వచ్చిన ఇమేజ్, కులం కార్డును ఉపయోగించుకొని పవన్ పొలిటికల్ కాంట్రాక్టులు చేస్తున్నారన్నారు. ప్రపంచస్థాయి నగరంగా విశాఖను అభివృద్ధి చేయాలని సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే జనసేన, టీడీపీ విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఫలితాలు చూశాక పవన్‌కు మతి భ్రమించినట్లు కనిపిస్తుందని, అందుకే పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నాడన్నారు.