మంగళగిరి నగరంలోని జాతీయ రహదారి వద్ద ప్రజలకు ఆటంకంగా ఉన్న మురుగును కార్పొరేషన్ అధికారులు శనివారం రాత్రి తొలగించారు.
ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ బిక్కిరెడ్డి శివారెడ్డి ఆ ప్రాంతంలో రహదారిపై నిలిచిన మురుగును సిబ్బందితో కలిసి జెసిబి సహాయంతో తొలగించారు. దీనితో ఈ ప్రాంతంలో మురుగునీటి సమస్య తొలగింది.