చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని నరసరావుపేట టిడిపి ఇన్చార్జ్ చదలవాడ అరవింద్ బాబు చెప్పారు.
శనివారం నరసరావుపేట పట్టణంలోని 28, 28 వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త పెట్టుబడిదారులు రాక పరిశ్రమలు లేక నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలన్నారు.