రంగు మారిన ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయాలని గుడివాడ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి వెనిగండ్ల రాము అన్నారు. శనివారం గుడ్లవల్లేరు మండల పరిధిలోని పెంజండ్రా గ్రామంలో తుఫాన్ కారణంగా వర్షపు నీటమునిగి నానుతున్న వరిచేలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ పంట చేతికి అంది వచ్చే సమయానికి తుఫాన్ కారణంగా వరి చేలన్నీ వర్షం నీటిలో నానుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa