టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆదివారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "గతంలో రైతులను చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారు.
వ్యవసాయం దండగ అని అన్నారు. 14 ఏళ్లలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటీ? రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది." అని వ్యాఖ్యానించారు.