అర్హత ఉండి పథకాల లబ్ధి లబ్ధి పొందని వారి కోసమే వికసితభారత్ సంకల్పయాత్ర చేపట్టామని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. శనివారం జోడిగుళ్లపాలెంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ సంకల్పయాత్ర రధాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. భారత్ ఎంతో అభివృద్ది చెందిందని, ప్రతి గ్రామంలో రహదారులు, కరెంటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.