మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫండ్ కోసం ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నానే తప్ప... లంచం కాదని వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎక్కడా అవినీతికి పాల్పడలేదని చెప్పారు.
మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకొనే పని చేశానంటూ ఒంగోలులో శనివారం బాలినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టిన ఆయన.. ఆదివారం విలేకర్లతో మాట్లాడారు.