బంగాళాఖాతంలో డిసెంబర్ 16న ఉపరితల ఆవర్తనం ఏర్పడి, 18కి అల్పపీడనంగా మారుతుందని వాతవరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దీని గమనం శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతోందని తెలిపింది.
అల్పపీడనం భారీ తుపాన్‌గా మారే అవకాశం ఉండటంతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. మిచౌంగ్ తుపాన్ నష్టం నుంచి కోలుకోకముందే ఏపీకి మరో తుపాను రూపంలో ముప్పు పొంచి ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.