వరల్డ్ ఇండోర్ ఆర్చరీ సిరీస్‌లో భాగంగా జరిగిన తైపీ ఓపెన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు రజత పతకం లభించింది.
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ 145–146తో భారత్‌కే చెందిన పర్ణీత్ కౌర్ చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ ప్రథమేశ్ స్వర్ణం సాధించాడు. ఫైనల్లో ప్రథమేశ్ 149–148తో మైక్ ష్లాసెర్(నెదర్లాండ్స్)పై గెలుపొందాడు.