అనంతపురం జిల్లా పెన్న అహోబిళంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం చేశారు.
ఉపాధ్యాయుడు మల్లేశ్ విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఉపాధ్యాయుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మల్లేశ్ తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఐదు పేజీల లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.