మిచౌంగ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత లేఖ రాశారు. 'మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా పంట, ఆస్తి నష్టం జరిగింది.
జాతీయ విపత్తుగా ప్రకటిస్తే మెరుగైన సహాయం బాధితులకు అందుతుంది. మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతుంది. మీ ప్రకటన ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతుంది.' అని లేఖలో పేర్కొన్నారు.