మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మొదలైన అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని ANU ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు తెలిసింది. పొత్తు ప్రకటన తర్వాత ఇద్దరు నేతలు ఒకే వేదిక మీదకు రానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.