భూమి కొనుగోలు లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపిస్తూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందుకు రావాల్సిందిగా ఈడీ హేమంత్ సోరెన్‌కు వరుసగా ఆరోసారి సమన్లు పంపింది. సోరేన్ మంగళవారం తమ ముందు హాజరయ్యే అవకాశం ఉందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. రాంచీలోని జోనల్ ఆఫీసులో ఆయనను విచారించనున్నట్లు చెప్పారు.