సీఎం జగన్ పాలనపై టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. జగన్ మాట తప్పాడు.. మడమ తిప్పాడు.. ఇచ్చిన హామీలు నేరవేర్చలేదంటూ 50 అంశాలతో కూడిన ఒక జాబితాను ట్విటర్లో షేర్ చేశారు.
ఈ జాబితాలో సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, విశాఖకు రైల్వే జోన్ తదితరాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడంలో ప్రభుత్వం చతికిలపడిందని గంటా పేర్కొన్నారు.