సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తుపాను బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జరగనున్న ధర్నా కార్యక్రమానికి మండలంలోని నెలబల్లి, ఏకొల్లు, సింగనాలతూరు, పూలతోట గ్రామాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. మండల తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జకరయ్య, ఉదయ కుమార్ పాల్గొన్నారు.