2023–24 ఏడాదికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను సీఎం జగన్ తాడేపల్లి కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,807 మంది జూనియర్ న్యాయవాదులు ఈ పథకానికి అర్హులు. వీరందరికి నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున.. 2023 జూలై నుంచి డిసెంబర్ వరకు(ఆరునెలలు) ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.30 వేలు జమ చేశారు. మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమ చేశారు.