మిచౌంగ్ తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం పల్నాడు జిల్లా సమితి సీపీఐ ఆధ్వర్యంలో వినుకొండలో అన్ని పార్టీల నాయకులు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జై భీమ్ భారత్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా సమన్వయకర్త, నరసరావుపేట అసెంబ్లీ ఇంచార్జి గోదా జాన్ పాల్ మాట్లాడుతూ. నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వ విఫలమైందన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.