ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు కొట్టారనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన దళిత యువకుడు మోజెస్ మృతి చెందాడు.
డిసెంబర్ 6న యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని మోజెస్ నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన మోజెస్కు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా.. మంగళవారం మృతి చెందాడు.