ఏపీలో 6,100 కానిస్టేబుల్, 411 SI ఉద్యగాల(మొత్తం 6,511 పోస్టులు) భర్తీపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కోర్టు అనుమతి రాగానే కార్యాచరణ ప్రారంభిస్తామని వెల్లడించారు.
త్వరలోనే SI పరీక్షల తుది ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పూర్తికాగా, ఈవెంట్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే.