పొన్నూరు మండలం చింతలపూడి డివిసి కళ్యాణ మండపంలో సోమవారం ఎన్ ఏ టి ఎస్ సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొని ఉత్తర అమెరికా తెలుగు సంఘం కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. 35 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎన్ ఏ టి ఎస్ డైరెక్టర్, మాజీ అధ్యక్షుడు మన్నవ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.