గుంటూరు పశ్చిమ సమన్వయకర్తగా మంత్రి విడదల రజినిని సోమవారం నియమించారు. ఆమె చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి సామాజికవర్గానికి చెందిన ఓటర్లు గుంటూరు పశ్చిమంలో చాలా తక్కువ.
అయితే ఆమెభర్త కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావటం నియోజకవర్గంలో ఆ వర్గం ఓట్లు అత్యధికంగా ఉండటంతో ఆమెను నియమించారు. అయితే ఇక్కడి సీటు ప్రస్తుత ఎమ్మెల్యే గిరిధర్, ఎమ్మెల్సీ ఏసురత్నం, మేయర్ కావటి తదితరులు ఆశించారు.