గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా అక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్‌ను నడుపుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే పిటిషనర్లకు ₹25 లక్షలు చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించింది.
ఆ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ అమలు చేయడంలేదని పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానాను విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రారు వద్ద లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది.