ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీకి అనుగుణంగానే నడుచుకుంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2023, 03:19 PM

 మేము ఎప్పటికి ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి మాటకి, పార్టీకి కట్టుబడి ఉంటామ‌ని, పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తామ‌ని గాజువాక ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డి, ఆయ‌న కుమారుడు దేవ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం  ఉదయం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ వైవీ సుబ్బారెడ్డిని వారి నివాసంలో గాజువాక ఎమ్మెల్యే  తిప్పల నాగిరెడ్డి, ఆయ‌న కుమారుడు గాజువాక మాజీ ఇన్‌చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ.. నేను గాని, నా కుమారులు కానీ ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కి  నమ్మకస్తులుగా ఉంటాం. పార్టీ కి విధేయులుగా ఉంటాం.  వైయ‌స్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటాం. వైయ‌స్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, అదే మాకు ముఖ్యం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com