వైయస్ జగన్ పార్టీని స్థాపించినప్పటి నుంచీ ఈ 12 ఏళ్లలో పార్టీని ప్రజలకు జవాబుదారీగా ఉంచారు. వైయస్ జగన్ గారి దృష్టిలో శాసన సభ్యునికి ఎంత విలువ ఉంటుందో కార్యకర్తకూ అంతే విలువ ఉంటుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం అన్నారు. ప్రజలకు మంచి సేవ చేయాలంటూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా ఈ 11 నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.వీటికి సంబందించి భవిష్యత్తులోనూ మార్పులు ఉండవచ్చు. శాస్త్రీయంగా సర్వేల ప్రకారం ప్రజల్లో మమేకం అయ్యే రీతిలో మెరుగైన ఫలితాల కోసం మార్పులు చేశారు. దీన్ని వేరేరకంగా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పార్టీ ఒక వ్యక్తి కోసమో..వ్యక్తుల కోసమో ఉండదు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతామని అన్నారు. ఎందుకు ఇలా చేశాం అనేది అంతర్గతంగా కూడా వారికి వివరిస్తామని అన్నారు.సహజంగానే స్థానికంగా మా నాయకుడికి ఇబ్బంది వచ్చిందని కొందరు నేతలు రియాక్ట్ కావచ్చు. ఈ ప్రభుత్వం మంచి మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావాలి. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వైయస్ జగన్ గారు అధ్యక్షులుగా శాస్త్రీయంగా లోతుగా ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక సెన్సేషనల్ కోసం ఆయన ఏదీ చేయడం లేదు. ఆయన ఏది చేసినా ఓపెన్ గా చెప్పారు. ప్రజలకు మళ్లీ మనం సేవ చేసే పరిస్థితి రావాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు గాలిలో మాటలు చెప్పి...ప్రజలను కన్ఫ్యుజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులకు ఒక దారీ తెన్నూ లేకుండా వారున్నారు. వైయస్ జగన్ గారు ప్రజలకు సేవ చేసే దిశగా సమీక్షిస్తూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలియచేశారు. సామాజిక న్యాయాన్ని అడ్రస్ చేయాలనే లక్ష్యంతో సాధ్యమైనంతగా ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీలకు పెద్ద పీట వేయాలనే ఇవన్నీ జరుగుతున్నాయి.ఇందులో మీడియాకు కూడా పెద్దగా సందేహాలు అక్కర్లేదు. భవిష్యత్తులో కూడా కొన్ని చేంజెస్ ఉండచ్చు...ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.