లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా అయన మాట్లాడుతూ.... మహిళలను గౌరవించడం, వారి విలువ తెలిసేలా చిన్న నాటి నుంచే పాఠ్యాంశాలు ప్రవేశపెడతాం. జగన్‌వి మాయ మాటలు. అసలు దిశ చట్టమే లేదు. వైసీపీ నాయకులే మహిళలను అవమానపరుస్తూ మాట్లాడితే ఇక బయట రక్షణ ఎలా ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రన్న బీమా 5 లక్షలతో ప్రారంభించి క్రమంగా రూ.10 లక్షలకు పెంచుతాం. డ్వాక్రా మహిళలను ఆదుకోకపోగా మీరు దాచుకున్న అభయహస్తం నిధులు 2200 కోట్లు జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభిస్తాం. నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తాం. పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాం. జగన్ 2.30 లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ.. మెగా డీఎస్సీ అని మోసం చేశాడు. జాతీయ విద్యా విధానం పేరుతో టీచర్ పోస్టులు తగ్గిస్తున్నాడు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. క్రమ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని నారా లోకేష్ స్పష్టం చేశారు.