నేడు లోకేష్ యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లా , చిన్నదొడ్డిగల్లుకి చేరుకుంది. ఇక్కడ మహిళలతో మహాశక్తి కార్యక్రమం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం తామర గ్రామానికి చెందిన పెద్దపల్లి లక్ష్మికి నారా లోకేష్ రెండు లక్షల ఆర్థిక సాయం అందజేశారు. తన కుమారుడిని ఇసుక మాఫియా, చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా దివ్యాంగురాలు వెంకటలక్ష్మికి స్కూటీ అందిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. మాయ హామీలు ఇచ్చి జగన్ మహిళలను మోసం చేశాడు. పాదయాత్రలో మహిళలు పడుతున్న కష్టాన్ని నేను చూశాను. మీ కన్నీళ్లు తీర్చే బాధ్యత నాది. టీడీపీ - జనసేన పార్టీలు కలిసి మహాశక్తిని ప్రకటించాం. జగన్‌ని తన సొంత తల్లి, చెల్లి నమ్మడం లేదు. తల్లికి, చెల్లికి న్యాయం చెయని జగన్ రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.