కనిగిరిలో మంగళవారం ఉదయం మన ఊరు-మన ఉగ్ర భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇంచార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టోను పథకాలను ప్రజలకు వివరించారు. మహిళాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని ఉగ్ర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.