పర్చూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లతో నిండిపోయిన 2014 నాటి ఓటర్ల జాబితానే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని వైసీపీ ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటనారాయణ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం పర్చూరులో ఆయన ఆర్వోను కలిసి దొంగ ఓట్ల పై భారీగా ఫిర్యాదులు అందినా అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. దొంగ ఓట్లపై సత్వర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమంచి కోరారు.