గిద్దలూరు పట్టణంలోని 17వ వార్డు నల్లబండబజారు ఇరిగేషన్ కాలువ వద్ద రక్షణ గోడ లేకపోవటం వలన ప్రజలు, వాహనదారులు కాలువలో పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నిర్లక్ష్యం వహిస్తున్నారని, రిబెట్ వాల్ నిర్మాణం కోసం టెండర్లు కూడా పూర్తి అయినప్పటికీ గుత్తేదారుడు పనులు మొదలుపెట్టలేదని అధికారులకు చెప్తున్నా కాలయాపన చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.