రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను మంగళవారం ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఈ కార్యక్రమం పై పీడీ, ఎంఈఓలతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలోని ప్రతి సచివాలయ పరిధిలో నిర్దేశించిన క్రీడలకు పురుషులు, మహిళా వీరులను పూర్తిస్థాయిలో ఏర్పాటు అయ్యేలా చూడాలన్నారు.