సామాజిక సాధికారతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మంగళవారం రాజంపేటలో సామాజిక సాధికారిక బస్సు యాత్రను రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మన్నూరు నుండి పాత బస్టాండ్ వరకు వారి ర్యాలీతో బస్సు యాత్రను చేపట్టారు. అనంతరం పాత బస్టాండ్ కూడలిలో బహిరంగ సభను నిర్వహించారు.