కడప జిల్లా బద్వేల్ మండలం ఎల్లుగారిపల్లెలో మంగళవారం విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందాడు. పొలంలో విద్యుత్ మోటారు మరమ్మత్తు చేస్తున్న తాత, మనమడు కి ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్ తగలడంతో మనమడు విజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, తాత ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ కు తరలించారు. విజయ కుమార్ కు సంవత్సరం క్రితమే వివాహం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.