సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని, పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తోందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరైన రూ. 10 లక్షల ఎల్ ఓ సి ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్రం ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలవెన్నంటి ఉంటుందని తెలిపారు.