బాలికపై అత్యాచారం కేసులో ఓ ఎమ్మెల్యేను కోర్టు దోషిగా నిర్ధారించింది. 2014లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యే రామ్దులర్ గోండ్‌పై ఆరోపణలున్నాయి.
యూపీ సోన్‌భద్ర జిల్లాలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసు విచారణ చేపట్టి, ఎమ్మెల్యేను దోషిగా తేల్చింది. డిసెంబర్ 15న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేరానికి పోక్సో చట్టం ప్రకారం సాధారణంగా ఏడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.