ఏపీలోని మిచౌంగ్ తుపాను నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఇవాళ తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు
సభ్యుల బృందం కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనుంది. కాగా ఇప్పటికే కరువు నివారణ చర్యల కోసం రూ.659 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.