అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను ఏపీ హైకోర్టు నేటికి వాయిదా వేసింది. నేడు చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్నారు.
ఐఆర్ ఆర్ కుంభకోణం కేసులో అనేక అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీడీపీ అధినేతను సీఐడీ నిందితుడిగా చేర్చింది.