మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం భారీగా జాబ్ కార్డులను తొలగించింది. ఒక్క 2022-23 ఏడాదిలోనే 5.48 కోట్ల జాబ్ కార్డులను తొలగించినట్లు వెల్లడించింది.
అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 83.43 లక్షలు, బిహార్‌లో 83.30 లక్షల కార్డులను తొలగించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ పార్లమెంటులో తెలిపారు. తప్పుడు, నకిలీ, వ్యక్తి మరణం ఇతర కారణాల వల్ల ఈ కార్డులను తొలగించినట్లు పేర్కొన్నారు.