ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందనుంది. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అటవీశాఖ పీసీసీఎఫ్ మధుసూదనరెడ్డి తెలిపారు.
50 రేంజర్లు, 200 సెక్షన్ ఆఫీసర్లు, 750 బీటు అధికారుల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.