ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉగ్రవాదుల చేతుల్లోకి వెళితే అది ప్రపంచానికే పెను ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
వివిధ అంతర్జాతీయ సమస్యలకు సంబంధించిన ఒప్పందాలు, ప్రోటోకాల్‌లు ఉన్నట్లే, కృత్రిమ మేధస్సు యొక్క నైతిక వినియోగం కోసం ప్రపంచ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని ఆయన సూచించారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో మోదీ వెల్లడించారు.