పశువధపై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా సౌకర్యమనే సాకుతో మూగ జంతువులను వధించకూడదని హెచ్చరించింది.
ప్రజలకు ఇబ్బందిని తొలగించే పేరుతో ఒక అమాయక ప్రాణిని బలి చేయకూడదని, అలా చేస్తే భగవంతుడు మనల్ని క్షమించడని హైకోర్టు పేర్కొంది.
వీధి పశువుల కోసం ఎన్ని పశు సంరక్షణాలయాలను ఏర్పాటు చేసింది, అక్కడ ఆ పశువులకు దాణా, నీరు పెడుతున్నారా? లేదా? అన్నది తెలియజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.