వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా వైసీపీ నాయకులూ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ... నాడు రాజశేఖరరెడ్డితో మొదలయింది సామాజిక సాధికారత. ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంతో ఎంతో మంది బీసీ,మైనార్టీ వర్గాల పిల్లలు పెద్దపెద్ద చదువులు చదవగలిగారు. ఉన్నతస్థాయిల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంతకు రెట్టింపుగా అణగారిన వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నారు. నా బీసీ, నా ఎస్సీ, నాఎస్టీ, నా మైనార్టీలంటూ వారిని ఎంతో ప్రేమిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి జగనన్న. వారి తల రాతలు మార్చాలని తపించే నాయకుడు జగనన్న. మన ప్రాంతంలో అభివృద్ది జరుగుతుందంటే. అభివృద్ధి కనిపిస్తుందంటే అది ఆరోజు వైఎస్.రాజశేఖరరెడ్డి, నేడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే అని అన్నారు.