పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా సంక్షేమ పథకాలను అందించాలని సీఎంగా జగన్ బాద్యతలు చేపట్టగానే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని, అదే బాబు సీఎం కాగానే జన్మభూమి కమిటీలు వేసి వారు చెప్పిన వారికే పథకాలు అందించాలని ఆదేశాలు ఇచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకునేలా చేసారని గుర్తు చేసారు. విద్యా రంగంలో జగన్ తీసుకువచ్చిన మార్పుల ద్వారా రాష్ట్రం దేశంలో 3 వ స్థానంలో నిలిచిందని, బాబు పాలనలో 15వ స్థానంలో మాత్రమే ఉండేదని వివరించారు. భారతదేశం నలుమూలలు తిరిగి రాష్ట్రం వైపు చూసేలా చదువుల విప్లవాన్ని తీసుకువచ్చారన్నారు.