శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురం జాతీయ రహదారి పక్కన రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుని సిఎం జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
తొలుత శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం పంపు హౌస్ లో బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు. ఆయన వెంట పలువురు మంత్రులతో పాటు, జిల్లా అధికారులు ఉన్నారు.