శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు చికిత్స అందించడంతో పాటు, సమస్య రాకకు
గల కారణాలపై పరిశోధనలకు రూ.85 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. అంతకుముందు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు.