ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువారం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.